మరో పచ్చబొట్టు వేయించుకున్న శృతిహాసన్... ఆ టాటు ఎవరిదో తెలుసా?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ టాటూ (Tattoo) వేయించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇలా ఎంతోమంది వారి పేర్లను లేదా ప్రత్యేకమైన తేదీలను టాటూలుగా వేయించుకుంటూ ఉన్నారు.

 Shruti Haasan Got Another Tattoo Do You Know Whose Tattoo It Is, Murugan, Shruth-TeluguStop.com

ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే సెలబ్రిటీలు ఇలా టాటూలను వేయించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు.ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ (Shruthi Hassan)సైతం ఇదివరకే ఎన్నో టాటూలను వేయించుకున్నట్లు మనకు తెలిసిందే.

ఈమె చేతి మణికట్టుపై గులాబీ టాటూ ఉండగా చెవి దగ్గర సంగీతానికి సంబంధించిన సింబల్ టాటూగా వేయించుకున్నారు.అయితే తాజాగా ఈమె మరొక టాటూ వేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Murugan, Rosetattoo, Shruthi Hassan, Tattoo-Movie

మరి ఈసారి శృతిహాసన్ ఎవరి పేరును టాటూగా వేయించుకున్నారు ఆ టాటూ ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే ఈసారి ఈమె తన పేరును తమిళంలో టాటుగా వేయించుకోవడమే కాకుండా తనకు ఎంతో ఇష్ట దైవమైనటువంటి మురుగన్(Murugan) ఆయుధంలో తన పేరు ఉండేలాగా టాటూ వేయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… నేనెప్పుడూ ఆధ్యాత్మికతవైపు మొగ్గు చూపుతుంటాను. నా హృదయంలో మురుగన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఈ పచ్చబొట్టుతో నాలోని భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాను అంటూ ఈమె ఈ టాటూ కు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తే చెప్పుకొచ్చారు.

Telugu Murugan, Rosetattoo, Shruthi Hassan, Tattoo-Movie

ఇలా శృతిహాసన్ షేర్ చేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ (Prabhas)హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ సినిమాలో(Salar Movie) కూడా నటించారు.ఈ సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

మొదటిసారి ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించడమే కాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube