నా కూతురి గురించి దారుణంగా కామెంట్స్ చేశారు.. ఎమోషనల్ అయిన స్టార్ యాక్టర్!

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి( Suniel Shetty ) గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సునీల్ శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Suniel Shetty Shocking Comments Goes Viral In Social Media Details, Suniel Shett-TeluguStop.com

సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన తెలిపారు.నా ఫ్యామిలీ గురించి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు చూసి బాధ పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కాలంలో వ్యక్తిగత గోప్యత లేదని ఆయన చెప్పుకొచ్చారు.నాకు సోషల్ మీడియా( Social Media ) అంటే భయం అని అందుకే మాట్లాడటానికి భయపడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.

నా కూతురు, తల్లి గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.అలాంటి ట్రోల్స్ వల్ల నేను చాలా బాధ పడ్డానని సునీల్ శెట్టి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ తరహా చర్యలు దేనికి దారి తీస్తాయో కూడా తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.తెర వెనుక ఉండే వ్యక్తులు నా ఫ్యామిలీ గురించి అసభ్యంగా కామెంట్ చేయడం బాధ కలిగించిందని సునీల్ శెట్టి తెలిపారు.ఇలాంటి వాటి గురించి తాను నిశ్శబ్దంగా ఉండనని ఆయన చెప్పుకొచ్చారు.సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి నెగిటివిటీ పెరుగుతోంది.ఏ తప్పు చేయకపోయినా కొంతమందిని టార్గెట్ చేసి పోస్టులు పెడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి తప్పుగా మాట్లాడే వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.సునీల్ శెట్టికి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube