పెళ్లి విషయంలో శృతి షాకింగ్ నిర్ణయం.. ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన క్రాక్ బ్యూటీ శృతి హాసన్ కెరీర్ మధ్యలో కొంత కాలం అవకాశాలు లేక తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంది.అయితే వకీల్ సాబ్, క్రాక్ వంటి సూపర్ హిట్లు అందుకుని మళ్ళీ ఈ బ్యూటీ దూకుడు పెంచింది.

 Shruti Haasan Dont Want Marriage, Shruti Haasan, Salaar, Balayya, Chiranjeevi, M-TeluguStop.com

క్రాక్ హిట్ తర్వాత శృతి హాసన్ కు పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.

ఈ సినిమా లో శృతి హాసన్ కు ఆఫర్ రావడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.మంచి అవకాశం పట్టేసిందని అంతా అనుకున్నారు.ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో కూడా శృతి హాసన్ కు అవకాశం వచ్చింది.బాలయ్యకు జోడీగా ఈమె నటించడానికి అంగీకరించి అందరికి షాక్ ఇచ్చింది.

అలాగే ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా శృతి చేయడానికి ఒప్పుకుంది.

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 154‘ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈమె కెరీర్ బాగానే సాగుతుంది.మరి ఈమె కెరీర్ విషయం పక్కన పెడితే ఈమె ఇప్పుడు పెళ్లి గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈమె ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ అయినా శాంతను హజారికా తో కొంత కాలంగా డేటింగ్ చేస్తుంది.

Telugu Salaar, Balayya, Boy Friend, Chiranjeevi, Shruti Haasan-Movie

ఈమె తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమెకు పెళ్ళిపై పెద్దగా ఆసక్తి లేనట్టు ఈమె చెప్పిన వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతుంది.అయితే ఈమె ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం వారి తల్లిదండ్రులే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె వాటిపై స్పందించింది.

వారు కలిసి ఉన్నత కాలం తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నారని.వారి కారణముగా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది.

Telugu Salaar, Balayya, Boy Friend, Chiranjeevi, Shruti Haasan-Movie

తాను పెళ్లి వద్దు అని అనుకోవడానికి తల్లిదండ్రులు కారణం కాదని చెబుతున్న.పెళ్లి చేసుకుని ఒక బంధంలో చిక్కుకు పోవడం ఈమెకు ఇష్టం లేదని స్పష్టం అవుతుంది.మరి ఈమె ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ లతో డేటింగ్ చేస్తూనే గడిపేస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube