టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.పైగా నటుడు కమల్ హాసన్ కూతురు కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఈమె బాలనటిగా అడుగుపెట్టి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది.పలు సినిమాలలో పాటలు పాడి తన పాటలతో అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈమె తొలిసారిగా హీరోయిన్ గా బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో పరిచయమైంది.తెలుగు ఇండస్ట్రీకి మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.తెలుగు, హిందీలోనే కాకుండా తమిళంలో కూడా నటించింది.ఇక శృతిహాసన్ వ్యక్తిగతంగా మాత్రం బాగా వార్తల్లో నిలిచింది.చాలావరకు తన ప్రేమ విషయంలోనే ఈమె ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా నిలిచింది.
వాటి వల్ల తను కొన్ని రోజులు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది.ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు అందుకుంది.
ఇక శృతి ప్రస్తుతం శాంతా ను హజారికా( Santa Nu Hazarika ) అనే ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.అతనితో కలిసి జీవిస్తుంది.
చాలాసార్లు ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అంతేకాకుండా వీరిద్దరు రోడ్లపై కొచ్చి బాగా హల్ చల్ కూడా చేస్తుంటారు.

ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది శృతి.సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా కలర్ఫుల్ చీరతో దర్శనమిచ్చి అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.మ్యాగ్జిమం ఈ బ్యూటీ ఎప్పుడు బ్లాక్ కలర్ మాత్రమే ధరిస్తూ ఉంటుంది.
ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది.తనకు బ్లాక్ కలర్ ఇష్టం కాబట్టి నిత్యం బ్లాక్ కలర్ ధరిస్తూ ఉంటాను అని గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను బ్లూ కలర్ సారీ లో చాలా రోజులకు కలర్ ఫుల్ గా కనిపించింది.
ఇక ఆ ఫోటో చూసి తన ఫ్యాన్స్ చీరలో అచ్చం పెళ్లి కూతురు లాగా ఉన్నావ్.అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ బ్యూటీ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు కానీ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇక ప్రస్తుతం పలు సినిమాలతో పాటు కొన్ని ఆల్బమ్స్ లో బిజీగా ఉంది.