సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు మళ్లీ తెలుగు, తమిళ సినిమాలతో సత్తా చాటుతుంది.తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ సినిమాల్లో నటించి మెప్పించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది.
సినిమాలతో పాటుగా తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలతో కూడా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే శృతి హాసన్ అప్పుడప్పుడు మెసేజ్ లను ఇస్తూ ఉంటుంది.తన వ్యక్తిత్వం గురించి.
జీవితంలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటుంది శృతి హాసన్.
అదేవిధంగా లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో తను ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని ప్రయత్నించానని.
దాని వల్ల చాలామంది స్నేహితులను కోల్పోయానని చెప్పింది.కాలం గడిచినా కొద్దీ తనలా తాను ఉండటం అలవాటు చేసుకున్నానని.దాని వల్ల తానేంటన్నది తనకు తెలిసిందని అంటుంది శృతి హాసన్.అంతేకాదు అసలైన సంతోషం కూడా అదేనని చెబుతుంది అమ్మడు.
సలార్ తో పాటుగా మరో రెండు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో శృతి హాసన్ పేరు వినిపిస్తుంది.అవి కూడా ఫైనల్ అయితే శృతి హాసన్ మళ్లీ ఫాం లోకి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు.