నటి శృతిహాసన్(Shruthi Hassan) ఈ ఏడాది మొదట్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సినిమా తర్వాత ఇతర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
శృతిహాసన్ నటించిన సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రభాస్(Prabhas ) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి సలార్ ( Salaar ) సినిమాలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా మొదటిసారి ప్రభాస్ సరసన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమాతో పాటు ఈమె హీరో నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న( Hai Nanna ) సినిమాలో కూడా కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది ఈ సినిమాతో పాటు ఈమె హాలీవుడ్ సినిమా ది ఐ( The Eye )సినిమాలో కూడా నటించారు.తాజాగా ఈ సినిమా గురించి శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఈ సినిమాలో బాగా నటించడం తనకు ఎప్పటికీ ప్రత్యేక మంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శితం కావటం విశేషం.ఇలా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమాలలో ప్రదర్శించడమే కాకుండా అవార్డుల కేటగిరికి కూడా నామినేట్ కావడంతో శృతిహాసన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక తన కెరియర్ లో ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమని, ఈ సినిమాని అందరికీ చూపించడం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని ఈమె వెల్లడించారు.