చుట్టూ పొద‌లు.. ఏంటా అని చూస్తే మైండ్ బ్లాంక్‌..!

అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళుతున్న భారత్ అంటే పాకిస్తాన్ కు ఎప్పుడు కోపమే.కుట్రలు పన్నడం, ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీదికి పంపడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య.

 Shrubs Around Mind Blank If You Look At Anything , Javan, Viral News, Bsf Dig Sp-TeluguStop.com

ప్రపంచ దేశాల ముందు ఎన్ని సార్లు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టినా వారి ప్రవర్తనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు.గతంలో ముంబాయి లో దాడుల్లో వందల మంది చనిపోయినా వారి కడుపుమంట చల్లారలేదు.

అమర్ నాథ్ యాత్ర వెళ్లే భక్తుల మీద కూడా దాడులు జరుపి 8 మందిని పొట్టనబెట్టుకున్నారు.తాజాగా అలాంటి ఓ కుట్రకు పన్నాగాలు పన్నారు.

భారత జవాన్ల ముందుచూపు ఆలోచనతో ఆ కుట్ర భగ్నం అయింది.

అమర్ నాథ్ యాత్ర భక్తులే టార్గెట్ గా జమ్ముకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని గుర్తించారు భారత జవాన్లు.

సాంబా జిల్లాలోని ఫఖీరా భార్డర్ అవుట్ పోస్ట్ 150 మీటర్ల సోరంగం ఉన్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.ఇటీవలే తవ్విన ఈ సోరంగం పాకిస్తాన్ నుండి నేరుగా ఇండియాలోకి ఉందని బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్పీఎస్ అధికారి సందు వెల్లడించారు.

అవుట్ పోస్ట్ కు 300 మీటర్ల దూరంలో ఈ సోరంగం ఉందని భారత చివరి గ్రామానికి కేవలం 700 మీటర్ల దూరంలోనే ఈ సోరంగం ఉందని అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తులపై కాల్పులు జరపడం కోసమే ఈ సోరంగం తవ్వారని బీఎస్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ సంవత్సరం జూన్ 30 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.2017 లో అమర్ నాథ్ యాత్రికులపై లస్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేస్తే 8 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Telugu Amarnath Yatra, Javan, Laskar Toiba-Latest News - Telugu

ఇక అలాంటి సంఘటనను పునరావృతం చేయడానికి ఉగ్రవాదులు మళ్ళీ కుట్రలు పన్నుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి కుట్రను భగ్నం చేశాయి.ఇలాంటి కుట్రలు ఉగ్రవాదులతో నేరుగా పాకిస్తాన్ అధ్యక్షుడే చేయిస్తున్నాడని గతంలో యూఎన్ఓ లో ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది.

మొత్తానికి ఉగ్రవాదుల, పాకిస్తాన్ కుట్రలు భారత జవాన్లు మల్లోసారి భగ్నం చేయడంతో అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube