పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ దుర్గ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1కొత్త చిత్రం.

రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథాంశంతో శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై అఖిల్ రాజ్, అనన్య నాగల్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వం లో జి.ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీ దుర్గ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ఘనంగా ప్రారంభమయ్యాయి .

 Shree Durga Creations Production Number 1 New Movie Which Started Grandly With Puja Programs. Akhil Raj, Ananya Nagalla, Surya Allamkonda, Tollywood, G. Nageshwar Reddy, G. Pratap Reddy, V. R. K. Naidu-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల నాంది పూజా కార్యక్రమాలు ప్రారంభించగా నటుడు దగ్గుపాటి అభిరామ్ హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నటుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ కొట్టారు.

దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోచిత్ర దర్శకుడు సూర్య అల్లంకొండ మాట్లాడుతూ.ఇక్కడకు వచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు.ఇది నా మొదటి చిత్రం ఇది కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ గోదావరి, పల్లమ్ వంటి ఔట్ అఫ్ స్టేషన్ లలో షూటింగ్ జరుగుతుంది.అఖిల్ రాజ్, అనన్య నాగల్ల ఇందులో హీరో, హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ దొరికారు.

ఆగష్టు నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను రెండు షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.నాకిలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత జి.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు.సూర్య అల్లంకొండ నాకు మంచి లవ్ స్టోరీ చెప్పగానే ఈ కథ నచ్చి శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను .ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు.మంచి లవ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో అఖిల్ రాజ్, మాట్లాడుతూ.ఇంతకుముందు చిన్న చిన్న యూట్యూబ్ లలో చేసిన తరువాత రెండు సినిమాలు చేశాను.ఇది నా మూడవ సినిమా.యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

చిత్ర హీరోయిన్ అనన్య నాగల్ల మాట్లాడుతూ.దర్శకుడు సూర్య గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.ఇదొక మంచి లవ్ స్టోరీ .ఈ కథపై మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాము.ఇలాంటి మంచి స్టోరీ కు హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.సినిమాటోగ్రాఫర్ వి.ఆర్.కె.నాయుడు మాట్లాడుతూ.నా ఫ్రెండ్ సూర్య మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు ఇంతకు ముందు తనతో రెండు ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది.

మళ్ళీ ఈ సినిమా ద్వారా తనతో ట్రావెల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.మంచి లవ్ స్టోరీ ఉన్న కథకు డి.ఓ.పి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

డైలాగ్ రైటర్ మాట్లాడుతూ.రెండు ప్రపంచాలు ప్రేమను ఎలా పరిచయం చేస్తాయి అనే కథ నాకు బాగా నచ్చడంతో ఈ కథను ఇంకా బాగా రాయాలని ముందుకు వెళ్తున్నాము.

శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి.ప్రతాప్ రెడ్డి నిర్మిస్తుండగా సూర్య అల్లంకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్.మాట్లాడుతూ.సూర్య గారు నాకు చెప్పిన కథ అద్భుతంగా ఉంది.

నాకే కాకుండా నిర్మాతకు కూడా నచ్చడంతో ఈ సినిమాను శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు పాటలు బాగా కుదిరాయి.ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీ నటులు

అఖిల్ రాజ్, అనన్య నాగల్ల తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : శ్రీ దుర్గా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ : జి ప్రసాద్ రెడ్డి, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ : సూర్య అల్లం కొండ కో-ప్రొడ్యుసర్ : నవీన్ బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్, సినిమాటోగ్రఫీ : వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ : పి ఆర్ ఆర్ట్ డైరెక్టర్ : ధర రమేష్ బాబు, పి.ఆర్.ఓ : వంశీ కాక, పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణ ప్రసాద్, ఎడిటర్ : ప్రణవ్, డైలాగ్స్ : పవన్ రైటింగ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : బీసీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ ::నిహారిక, కో డైరెక్టర్ : ఏం మధుసూదన్ రెడ్డి

.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube