బన్నీకి నో చెప్పి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు యస్ చెప్పిన క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప2.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ సినిమా ప్రపోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్.అయితే మూవీ మేకర్స్ ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేస్తున్నాము అని ప్రకటించినప్పటికీ ఈ విడుదల తేదీపై మాత్రం అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే పుష్ప1 సూపర్ హిట్ అవడంలో కీలక పాత్ర పోషించింది ఐటం సాంగ్.తిరిగి పుష్ప2లో కూడా దర్శకుడు సుకుమార్ ఐటం సాంగ్ ప్లాన్ చేసి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor )చేత చేయిద్దామని చాలా ప్రయత్నించారు.

Shraddha Kapoor Doing An Item Song With Jr Ntr In War-2, Shraddha Kapoor, Jr Ntr

కానీ శ్రద్ధ రూ.10 కోట్ల పారితోషికం అడగడంతో ఆమెతో చేయించాలనే ఆలోచన విరమించుకొని డాన్సింగ్ క్వీన్ గా పేరున్న శ్రీలల చేత చేయించారు.అయితే స్త్రీ 2 సినిమా ( Woman 2 movie )ద్వారా రూ.650 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి టాప్ రేంజ్ లో ఉన్న శ్రద్ధాకపూర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్2 సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది.ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
Shraddha Kapoor Doing An Item Song With Jr Ntr In War-2, Shraddha Kapoor, Jr Ntr

తారక్, హృతిక్, శ్రద్ధాకపూర్ చేత మంచి మాస్ స్టెప్పులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Shraddha Kapoor Doing An Item Song With Jr Ntr In War-2, Shraddha Kapoor, Jr Ntr

ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు.తమ హీరోతో నటించకుండా తారక్ తో నటిస్తోందంటూ వాపోతున్నారు.బహుశా ఆమె అడిగినంత పారితోషికాన్ని వారు ఇచ్చివుంటారని అంటున్నారు.వార్2ను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఆగస్టు 14న వార్ 2 విడుదలవుతుంది.

డిసెంబరు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో తారక్ పాల్గొంటాడు.దీన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు