తక్కువ సంఖ్యలో సినిమాల్లోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని సిద్ధు జొన్నలగడ్డ వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.డీజే టిల్లు సినిమా సక్సెస్ సాధించి సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న టాలీవుడ్ ప్రముఖ నటులలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు.అయితే సిద్ధు జొన్నలగడ్డ సినిమాల ద్వారా నిర్మాతలకు కూడా మంచి లాభాలు వచ్చాయి.
అయితే కొంతమంది హీరోలు మాత్రం ఒక సినిమా సక్సెస్ సాధిస్తే దర్శకనిర్మాతలకు షరతులు విధిస్తూ చుక్కలు చూపిస్తున్నారు.ఒక హీరో తన సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆ హీరో సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు రాలేదు.
భారీ ఓటీటీ ఆఫర్ ను ఈ సినిమా మేకర్స్ వదులుకోగా భారీ నష్టాల వల్ల ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై మోయలేనంత భారం పడింది.

మరో హీరో కథలో వేలు పెడుతూ ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.తనకు నచ్చిన విధంగానే కథ, కథనం ఉండాలనే ఆలోచనతో ఈ హీరో తీసుకుంటున్న నిర్ణయాలు ఈ హీరో కెరీర్ పైనే ప్రభావం చూపుతున్నాయి.
టాలీవుడ్ హీరోలు మారాల్సిన అవసరం ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
కథ, కథనం విషయంలో హీరోలు చేస్తున్న చిన్నచిన్న తప్పులు నిర్మాతల పాలిట శాపంగా మారుతున్నాయి.