తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కెసీఆర్ టార్గెట్ గా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో బీజేపీ మరింత ఘాటు విమర్శలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ తాజాగా వెలువడ్డ ఎన్నికల్లో విజయ దుంధుబి మోగిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో కూడా అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఇతర రాష్ట్రాలలో భారీ విజయంతో కాస్త జోష్ నిండినట్టయింది.
అయితే తెలంగాణలో యూపీలో బీజేపీ గెలుపు ప్రభావం అనేది తెలంగాణపై పడుతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అయితే బీజేపీ నేతలు ఇక మరింత జోష్ తో తెలంగాణలో యూపీ మరియు ఇతర రాష్ట్రాలలో ప్రయోగించిన వ్యూహాలను ప్రయోగించే అవకాశం ఉంది.
అయితే ఆ తరహా వ్యూహాలు తెలంగాణలో ఎంత మేరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకమైన విషయం.ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం రణరంగంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే అప్పుడు ఉండబోయే పరిస్థితులను ముందే ఊహించిన కెసీఆర్ ఇప్పటి నుండే కాస్త అనుకూల పవనాలు వీచేలా తగు నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలకు గట్టి పోటీనిస్తున్న పరిస్థితి ఉంది.బండి సంజయ్ ఇక త్వరలోనే ఎన్నికల ఫలితాలపై స్పందించే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఎలా రాజకీయ వాతావరణం మారిపోతుందనేది ఊహించని పరిస్థితి ఉంటుంది.ఎందుకంటే ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బలంగా భావిస్తున్న కెసీఆర్ తనదైన శైలిలో బలమైన వ్యూహాలను ప్రయోగిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.







