టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన అలీ(Ali) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న ఆలీ కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.
కానీ ఎక్కువగా కామెడీ పాత్రలలో నటించడంతో కమెడియన్ గా బాగా ఫేమస్ అయ్యాడు.అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో కూడా హోస్ట్ గా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ‘భారీ తారాగణం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అలీ గెస్ట్ గా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో అలీ చిన్న సినిమాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమాలో అలీ అన్న కొడుకు సదన్ హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు యస్.
వి.కృష్ణా రెడ్డి,(s V Krishna Reddy) నిర్మాత అచ్చిరెడ్డి(Achireddy), కమెడియన్ ఆలీ ముఖ్య అతిధులుగా పాల్గొని ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో చిన్న సినిమాల సినిమాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో అలీ మాట్లాడుతూ.” మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇందులో నాకు మంచి పాత్ర లభించింది.ఇలాంటి మంచి సినిమాలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.అయితే ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.పెద్ద పెద్ద సినిమాలు డబ్బింగ్ చేస్తారు.
రీమేక్ కూడా అవుతాయి.కానీ చిన్న సినిమాలు బాగున్నప్పటికీ వేరే స్టేట్ వాళ్లు ఎందుకు డబ్బింగ్ చేసుకోరనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు.
చిన్న సినిమాలు, చిన్న హీరోలను, నిర్మాతలను ఎంకరేజ్ చేస్తే .అవి హిట్ అయితే పది మంది నిర్మాతలు, హీరోలు పుడుతారని చెప్పుకొచ్చారు.చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది” అంటూ అలీ చెప్పుకొచ్చాడు.