బీజేపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో ఎక్కువగా ప్రచారంలో కనిపిస్తునన్నాడు.బీజేపీ పార్టీ వాయిస్ ని మీడియాలో వినిపిస్తూ, అలాగే ఏపీలో ఆ పార్టీపై జరుగుతున్నా దుష్ప్రచారం అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు మీడియా ముందుకి వచ్చి టీడీపీ మీద విమర్శలు దాడి చేయదానికి జీవీఎల్ ముందు వరుసలో ఉంటున్నారు.
చీటికి మాటికి వైసీపీ తరుపున కూడా వకాల్తా పుచ్చుకునే జీవీఎల్ కి తాజాగా ఘోర అవమానం జరిగింది.
ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంగా.
ఆయనపై కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ చెప్పు విసిరారు.అయితే జీవీఎల్‌కు అది దూరంగా పడింది.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.చెప్పు విసిరిన వ్యక్తి అద్వాని వీరాభిమాని అని అతని సోషల్ మీడియా పోస్టులు బట్టి తెలుస్తూ ఉండగా.
ఈ మధ్యకాలంలో అతని మీద ఐటీ దాడులు చేసి అనధికారికంగా ఉన్న డబ్బుని సీజ్ చేసారు.ఆ కోపంతో మోడీ అనునాయిలుగా ఉన జీవీఎల్ పై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.







