ఎక్కడైనా సరే మనం పాము( Snake )ను చూస్తే భయంతో కొద్ది దూరం వెళ్ళిపోతాము.అలాంటి పాము ఏకంగా బతికి ఉండగానే తినే ఆహారంలో పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి.
అలా విషయం తెలియకుండా ఓ వ్యక్తి తినే పదార్థంలో పామును బాగా కలిపి గరిటతో తీసి ప్లేటులో వడ్డించబోయాడు.అయితే అదృష్టవశాత్తు గరిటలో వడ్డించే ముందు చూడగా అందులో కదలాడుతున్నట్లుగా ఏదో అనిపించింది.
దాంతో ఏంటా అని గమనిస్తే పాముగా గుర్తించారు.ఇదేదో కల్పిత కథ అనుకుంటారేమో.
నిజంగా జరిగిన సంఘటన.ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మహారాష్ట్ర( Maharashtra ) రాష్ట్రంలోని బండారాలో ఫుడ్ సర్వీస్ లొకేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ విషయం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఫుడ్ సర్వీస్ లొకేషన్ లో ఓ వెజిటబుల్ కర్రీలో ఓ పాము పిల్ల కదులుతూ ఉండడం వైరల్ గా మారిన వీడియోలో మనం చూడవచ్చు.నిజానికి అందులో పడిన పాము మొదటగా చనిపోయిందని అనుకున్నాడు వ్యక్తి.
కాకపోతే అది నిశితంగా పరిశీలిస్తే కూరలో బతికి ఉన్నట్లుగానే కనబడింది.అసలు విషయం ఏమిటంటే.
ఆ పాము మన దేశంలోనే మూడవ అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాము.నిజానికి ఇది జరిగి కొద్దిరోజులైనా కానీ ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఒకవేళ ఎవరైనా కర్రీ తిన్నారేమో ముందు వారిని హాస్పిటల్లో చేర్పించండి అంటూ కొందరు అంటుండగా.మరికొందరేమో ఈ పాము విషపూరితమైనది కాదని కామెంట్స్ చేస్తున్నారు.ఏదేమైనా తినే ఆహారంలో బతికున్న పాము కనిపిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో ని ఒకసారి వీక్షించండి.







