బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఈ వారం ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
అశ్విని, శోభా శెట్టి, రతికలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరగగా చివరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని క్లారిటీ వచ్చింది.
అయితే లేడీ కంటెస్టెంట్లను సేవ్ చేయడానికే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శోభా శెట్టి, రతిక ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ కు ఇష్టం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల వచ్చే వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
మరోవైపు బిగ్ బాస్ సీజన్7 మెరుగైన రేటింగ్స్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ షోను మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.బిగ్ బాస్ రివ్యూవర్లలో ఒకరు ఎలిమినేషన్( Bigg Boss Elimination ) గురించి ప్రతి వారం ఇచ్చే అప్ డేట్ కూడా ఈసారి రాంగ్ కావడం గమనార్హం.బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ సాధించిన నేపథ్యంలో భవిష్యత్తు సీజన్లపై అంచనాలు పెరుగుతున్నాయి.
బిగ్ బాస్ హోస్ట్ మారతారని చెబుతున్నా నాగ్( Nagarjuna ) స్థాయిలో హోస్టింగ్ చేసి మెప్పించే మరో యాంకర్ దొరకడం కూడా సులువు కాదని నాగ్ పెద్దరికం ఆయనకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షోపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్( World Cup Final Match ) ఎఫెక్ట్ కూడా పడింది.
ఈరోజు ఎపిసోడ్ ఎంత అద్భుతంగా ఉన్నా ప్రేక్షకులు బిగ్ బాస్ షోపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.బిగ్ బాస్ షో సీజన్7 రాబోయే రోజుల్లో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఈ షోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy