అశ్విని, శోభా శెట్టి, రతిక.. ముగ్గురిలో ఎవరూ ఎలిమినేట్ కారట.. బిగ్ బాస్ ఎంతకు తెగించాడంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఈ వారం ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి.అశ్విని, శోభా శెట్టి, రతికలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరగగా చివరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని క్లారిటీ వచ్చింది.

 Shocking Twists In Bigg Boss Eliminations Details Here Goes Viral In Social Med-TeluguStop.com

అయితే లేడీ కంటెస్టెంట్లను సేవ్ చేయడానికే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శోభా శెట్టి, రతిక ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ కు ఇష్టం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల వచ్చే వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

మరోవైపు బిగ్ బాస్ సీజన్7 మెరుగైన రేటింగ్స్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ షోను మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.బిగ్ బాస్ రివ్యూవర్లలో ఒకరు ఎలిమినేషన్( Bigg Boss Elimination ) గురించి ప్రతి వారం ఇచ్చే అప్ డేట్ కూడా ఈసారి రాంగ్ కావడం గమనార్హం.బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ సాధించిన నేపథ్యంలో భవిష్యత్తు సీజన్లపై అంచనాలు పెరుగుతున్నాయి.

బిగ్ బాస్ హోస్ట్ మారతారని చెబుతున్నా నాగ్( Nagarjuna ) స్థాయిలో హోస్టింగ్ చేసి మెప్పించే మరో యాంకర్ దొరకడం కూడా సులువు కాదని నాగ్ పెద్దరికం ఆయనకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షోపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్( World Cup Final Match ) ఎఫెక్ట్ కూడా పడింది.

ఈరోజు ఎపిసోడ్ ఎంత అద్భుతంగా ఉన్నా ప్రేక్షకులు బిగ్ బాస్ షోపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.బిగ్ బాస్ షో సీజన్7 రాబోయే రోజుల్లో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఈ షోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube