ఢిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.ఈ క్రమంలో అంజలి శరీరంపై నలభైకి పైగా గాయాలున్నట్లు తెలుస్తోంది.
పక్కటెముకలు బయటకు వచ్చాయని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు.రోడ్డుపై కారు ఈడ్చుకెళ్లడంతో శరీరం కమిలిపోయిందన్నారు.
అదేవిధంగా అంజలి ఆల్కహాల్ తాగలేదని గుర్తించారు.మరోవైపు అంజలి కుటుంబ సభ్యులను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పరామర్శించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.







