షాకింగ్: ఆ వ్యోమగామి జాకెట్‌ రూ.22 కోట్ల ధరకు అమ్ముడైంది.. ఎవరంటే?

మీరు విన్నది నిజమే.ఆ వ్యోమగామి జాకెట్‌ అక్షరాలా రూ.22 కోట్ల ధరకు అమ్ముడై చరిత్ర సృష్టించింది.అపోలో 11 మిషన్ కోసం మాజీ అమెరికన్ వ్యోమగామి అయినటువంటి “బజ్ ఆల్డ్రిన్” ధరించిన ఇన్‌ఫ్లైట్ కవరాల్ జాకెట్ మంగళవారం న్యూయార్క్‌లో వేలం వేయడం జరిగింది.ఈ జరిగిన వేలంలో $2.7 మిలియన్లకు విక్రయించబడిందని వేలం సంస్థ సోథెబీస్ అధికారికంగా ప్రకటించింది.అంటే మన కరెన్సీలో సుమారుగా 22 కోట్లు అన్నమాట.

 Shocking That Astronaut S Jacket Was Sold At A Price Of Rs 22 Crores Whose , Jac-TeluguStop.com

1969 జూలై 16న ముగ్గురు వ్యోమగాములు చంద్రునిపైకి విజయవంతంగా వెళ్లారు.

అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్ జూలై 20, 1969న చంద్రునిపై దిగింది.చంద్రునిపై అడుగుపెట్టిన మొట్ట మొదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ని చెప్పుకుంటాం.

ఆయనతో పాటు ఈ మిషన్ లో బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్‌ కూడా వెళ్లారు.చంద్రుని ఉపరితలంపై కాలు మోపిన రెండవ వ్యక్తిగా ఆల్డ్రిన్ ని అభివర్ణిస్తారు.

ప్రస్తుతం ఆల్డ్రిన్ వయసు 92 ఏళ్ళు.కాగా ఈ మిషన్ లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులలో ప్రస్తుతానికి జీవించి ఉన్న ఏకైక వ్యక్తి ఈయనే.

Telugu Jacket, Latest-Latest News - Telugu

మూన్ పై అడుగుపెట్టే సమయంలో ఆల్డ్రిన్ ధరించిన ఈ తెల్లటి జాకెట్‌పై అమెరికా జెండా, NASA మొదటి అక్షరాలు, అపోలో 11 మిషన్‌కు సంబంధించిన ప్యాచ్, “E.ALDRIN” అనే పేరు ఉండటం మనం గమనించవచ్చు.ఆల్డ్రిన్ అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్న వస్తువుల వ్యక్తిగత సేకరణలో ఈ జాకెట్ ఒక భాగం మాత్రమే.ఇంకా అనేక వస్తువులు వున్నాయి.వాటిని భవిష్యత్తులో వేలం వేయనున్నారు.ఆయన అసలు పేరు ఎడ్విన్ యూజీన్ ఆల్డ్రిన్ జూనియర్‌.

అందువల్ల జాకెట్ పై “E.ALDRIN” అనే పేరు ఉండటాన్ని మనం ఫొటోలో చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube