“చంద్రబాబు” కి షాక్ ఇవ్వనున్న “ఏపీ మంత్రి” ..ఆ “సర్వే ఎఫ్ఫెక్టే” నా

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్వేల హడావిడి మామూలుగా ఉండదు.అన్ని రాష్ట్రాలో ఈ హడావిడి ఉంటూనే ఉంటుంది అయితే ఎప్పుడు సహజంగా జరిగే సర్వేలు ఆయా పార్టీల అధినేతలు చేయించడం వలన గానీ.

 Shocking Surveys In Ap Political Leaders-TeluguStop.com

లేదా కేంద్రం చేయించడం వలన కానీ లేకపోతే ప్రముఖ మీడియా చానెల్స్ వాళ్ళు చేస్తుంటారు.అప్పుడప్పుడు కొన్ని సంస్థలు కూడా ఈ సర్వేలు చేపడుతుంటాయి.

అయితే తమ తమ పార్టీలో ఉండే నేతలు పక్క పార్టీలలోజంప్ అయిపోతారు అనే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ పార్టీ అధినేతలకి ముందుగానే అందిన సమయంలో ఎదో ఒక సర్వే ఆ పార్టీకి అనుకూలంగా వచ్చేస్తుంది దాంతో జంపింగ్ లకి అడ్డుకట్ట వేస్తుంటారు.

ప్రతీ ప్రభుత్వం తమ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వేలు చేయిస్తూ ఉంటాయి.ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంటారు.అయితే తాడిని తన్నే వాడు ఉంటే దాని తల తన్నే వాడు ఉంటాడు అంటారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.ఏపీలో నాయకులు ఇప్పుడు సొంతగా సర్వేలు చేయించుకుంటున్నారట.

షాక్ అయ్యారా ? నిజమేనండి ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.ఇది కొత్త విషయం కాకపోయినా ఏపీలో మాత్రం ఇది కొత్తగానే ఉంటంది.

ఎందుకంటే ఈ తరహా సర్వేలు ఎప్పుడు ఎవరూ చేయించలేదు కూడా.

అయితే తాజా సమాచారం ప్రకారం వివిధ పార్టీలో ఉన్న నేతలు తాము ఏ పార్టీలో చేరితే బెటర్.? పార్టీలో చేరినా సరే ఎక్కడి నుంచీ పోటీ చేస్తే మంచిది.? ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపి, టిడిపి ,జనసేన ఏది బెటర్.అనే ఆలోచనలో ఉన్న నేతలు ఈ సర్వేలని నమ్ముకుని సర్వేల రిజల్ట్స్ పైనే ఆధారపడి ఉన్నారట…అయితే సర్వేల రారాజు అయిన లగడపాటి ని కూడా కొంతమంది నేతలు కలిసి సంప్రదించినట్టు టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే లగడపాటిని సంప్రదించిన వారిలో ఎక్కువ మంది అధికార టిడిపికి చెందిన నేతలు,మంత్రులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం.

వారిలో ముఖ్యంగా ఓ సీనియర్ మోస్ట్ మంత్రి కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది…అయితే లగడపాటికి ఇలాంటి సర్వేలు చేయడం చేయడం కొత్త ఏమీ కాదు గతంలో తెలంగాణాకి చెందిన ఓ ప్రముఖ నాయకుడికి ఈ విషయంలోనే ఓ సర్వే చేసి దిశానిర్దేశం చేసిన విషయం మనకి తెలిసిందే.ఇదే కోణంలో ఏపీ మంత్రులు సైతం ఈ సర్వేలని నమ్ముకోవడంతో ఇప్పుడు అందరూ జాతకాలకి బదులు సర్వేలని నమ్ముకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube