సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్న వీడియోలు దాదాపుగా ఒకేలాగా నవ్వుని తెప్పించేవిగా ఉంటాయి.అయితే అప్పుడప్పుడు వాటిలో కొన్ని వీడియోలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి.
అలాంటి వీడియోలు చూసినపుడు మనకి చాలా ఇన్స్పైరింగ్( Inspiring ) గా అనిపిస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూడవచ్చు.
సాధారణంగా కార్లు , బైక్ లు అన్నీ పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తూ ఉంటాయి.ఇక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.

అయితే వాటికి భిన్నంగా బీరుతో నడిచే బైక్ ను ఎప్పుడైనా మీరు చూసారా? మీరు చూసుండరు కదూ.బీరుతో బైక్ నడవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? వినడానికి నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజమే అండి.అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కేవలం బీరుతోనే నడిచే బైక్ ను తయారు చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు.అతను బైక్ లో ఏర్పాటు చేసిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకు మండిస్తుందట.
దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పని చేస్తుందని మైకల్సన్( Michelson ) వివరించాడు.

ఇకపోతే, ఇతను తయారు చేసిన ఆ బైక్ గంటకు 240 కిలో మీటర్లు వరకు నడుస్తుందని కూడా అతగాడు చెబుతున్నాడు.ఈ విషయం బయటకు రావడంతో స్థానికులతో పాటు నెటిజన్లు మనోడిని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు.ఇలాంటి ఐడియాలు కదా ఇప్పటి జెనరేషన్ చేయవలసినది అని కీర్తిస్తున్నారు.
ఇకపోతే, ఆ బైక్స్ రాబోయే రోజుల్లో మార్కెట్లోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.







