వాహనదారులకు షాకింగ్ న్యూస్‌.. ఇక గీత దాటితే బాదుడే బాదుడు..

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ అంత అధికంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ తీసుకొస్తూనే ఉన్నారు.

ఇందులో భాగంగా సోమవారం నుంచి రెండంచల స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపితే ఫైన్ విధించనున్నారు.వాహనాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తాజాగా ప్రకటించారు.పాదచారులకు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డుపై సాఫీగా వెళ్లిపోయేందుకు ఈ రూల్స్ ఎంతగానో హెల్ప్ అవుతాయి.హైదరాబాద్ పోలీసుల ప్రకారం, రోడ్డుపై బైకులు నిలిపిన వారు రూ.100 ఫైన్‌తో పాటు రూ.200 టోయింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.కారు వాహనదారులకైతే రూ.100 ఫైన్, రూ.600 టోయింగ్‌ ఛార్జీలు విధించనున్నారు.అంతేకాదు, జీబ్రా క్రాసింగ్‌ల వద్ద స్టాప్‌లైన్‌ను దాటి ముందుకు వస్తే రూ.200 ఫైన్ వసూలు చేయనున్నారు.సిగ్నల్స్ దగ్గర ఎడమ వైపు లేదా ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డంగా వెహికిల్స్ ఆపిన వారికి రూ.1,000 జరిమానా విధించనున్నారు.ఈ విధంగా చూసుకుంటే హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్స్ రూల్స్‌ను ఉల్లంఘించే వారికి భారీగా ఫైన్లు పడనున్నాయని తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 80 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని అంచనా.వీటివల్ల ఎవరికీ ఏ ఇబ్బందులు కలగకుండా పైన పేర్కొన్న నిబంధనలను అక్టోబర్​ 3 నుంచి అమల్లోకి తెస్తామని ట్రాఫిక్​ పోలీస్​ జాయింట్​ కమిషనర్​ రంగనాథ్ వెల్లడించారు.ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెట్టినా వారికి భారీ జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీస్ నిర్ణయించింది.

కాగా ఈ నిబంధనలు తీసుకురావాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకోవడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు