షాకింగ్: టాయిలెట్‌ గుంతలో బోలెడు బంగారు నాణేలు... ఎలా?

అదేంటి, టాయిలెట్‌ గుంతలో బంగారు నాణేలు వుండడమేంటని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి.మీరు విన్నది నిజమే.

 Shocking Lots Of Gold Coins In Toilet Pit , Toilet, Viral Latest, News Viral, So-TeluguStop.com

ఓ మహిళ ఇంట్లో టాయిలెట్‌ నిర్మాణం కోసం కూలీల సహాయంతో ఓ పెద్ద గుంత తవ్వుతున్నది.ఈ క్రమంలోనే కూలీలకు ఓ రాగి పాత్ర కనిపించింది.

దాన్ని తెరిచిచూడగా.బ్రిటిష్‌ కాలం నాటి బంగారు నాణేలు అందులో కనిపించాయి.

ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే మహిళ నూర్‌ జహాన్‌ కుటుంబ సభ్యులు గానీ, కూలీలు విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

చివరకు బంగారు నాణేల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

బంగారు నాణేలు బ్రిటిష్‌ (1889-1920) కాలానికి చెందినవని తేలింది.

పోలీసులు పలువురు కూలీలను విచారించగా.మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇమామ్ అలీ రైనీ భార్య నూర్ జహాన్ తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంత తవ్విస్తున్నది.గొయ్యి తవ్వుతున్న క్రమంలో ఓ రాగి కనిపించింది.

అందులో బంగారు నాణేలు కనిపించడంతో పనులు మానేసి వాగ్వాదానికి దిగారు.మరుసటి రోజు కూలీలు తిరిగి వచ్చి మళ్లీ ఇంకా ఏమైనా దురుకుతాయేమోనని ఆశతో మళ్లీ తవ్వారు.

అయితే, ఓ కూలీ రైనీని తనకు బంగారు నాణేలు కావాలని డిమాండ్‌ చేశాడు.దీంతో కూలీకి ఒక బంగారు నాణెం ఇచ్చాడు.

అయితే, బంగారు నాణేల విషయం పోలీసులకు తెలిసింది.దీంతో ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Telugu Britishperiod, Copper Vessel, Gold Coins, Jaunpur, Kotwali, Toilet, Uttar

పోలీసులు రైనీ కుటుంబాన్ని, కూలీలను విచారించగా.మొదట అలాంటిదేమీ లేదని బుకాయించారు.పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో చివరకు విషయాన్ని బయటపెట్టారు.కూలీలు బంగారు నాణేలను పోలీసులకు తిరిగి ఇచ్చారు.అసలు రాగి పాత్రలో ఎన్ని నాణేలు దొరికాయన్న విషయంపై ఇంకా స్పష్టత రావలసి వుంది.కూలీలను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు.

సంఘటనా స్థలానికి వెళ్లగా. కూలీలను ఆరా తీస్తే 10 నాణేలు లభ్యమయ్యాయి.

ప్రస్తుతం పూర్తినాణేలను స్వాధీనపరుచుకునేంత వరకు విచారణ కొనసాగుతుందని మచ్లీషహర్ అధికారి అతర్ సింగ్ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube