జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఆరోగ్య సమస్యల వల్ల ఆయన నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు ఆలస్యమవుతున్నాయి.నిన్న అనకాపల్లి సభ అనంతరం పవన్ కళ్యాణ్ వైజాగ్ విమానశ్రయానికి( Vizag Airport ) కారులో వెళ్తుండగా సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడి కోలుకున్న పవన్ మళ్లీ సొమ్మసిల్లి పడిపోవడం ఆయన అభిమానులను కంగారు పెడుతోంది.ఏపీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటం వల్లే సుకుమారంగా పెరిగిన పవన్ కళ్యాణ్ కు కొత్త ఆరోగ్య సమస్యలు( Pawan Kalyan Health Problems ) వస్తున్నాయని తెలుస్తోంది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 42 డిగ్రీలు, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో సాయంత్రం సమయంలో సభలు నిర్వహించేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పవచ్చు.ఉదయం, సాయంత్రం సభలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటే పవన్ ను కొత్త సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ అయితే ఉండదు.
ఎన్నికలకు నెలరోజుల సమయం మాత్రమే ఉండటంతో పవన్ కళ్యాణ్ జనంలోకి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.పవన్ పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది.ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏపీ రాజకీయాలలో( AP Politics ) పొలిటికల్ లెక్కలు శరవేగంగా మారుతున్నాయి.ఈ ఎన్నికలు జనసేన భవిష్యత్తును డిసైడ్ చేసే ఎన్నికలు అని కూడా చెప్పవచ్చు.
పొలిటికల్ గా పవన్ ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ ఉండేలా చూసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న నేపథ్యంలో పవన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారం నిర్వహించాల్సి ఉంది.జనసేన( Janasena ) పోటీ చేసే 21 స్థానాలలో ఎన్ని స్థానాల్లో పార్టీని పవన్ గెలిపించుకుంటారో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రచారాన్ని( Janasena Campaign ) మొదలుపెట్టి ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.
ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తే 2024 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.