మిస్ ఫైర్ ఐతే సేఫ్ గా ఉండాలని చంద్రబాబు ట్వీట్.. ట్వీట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోవడానికి జగన్ మాత్రమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సీఎం జగన్( CM Jagan ) ప్రజలకు మంచి జరిగేలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నా చంద్రబాబు( Chandrababu ) మాత్రం జగన్ పై విమర్శలు చేస్తూనే వచ్చారు.

విజయవాడ సింగ్ నగర్ లో సీఎం జగన్ పై పదునైన వస్తువుతో దాడి జరగగా ఆయనకు తలపై బలమైన గాయమైంది.జగన్ పై దాడి జరిగిన క్షణం నుంచి టీడీపీ నేతలు( TDP Leaders ) జగన్ పై సానుభూతి ప్రకటించడానికి బదులుగా కోడికత్తి డ్రామా 2.0 అంటూ చెత్త వాదనను తెరపైకి తెస్తున్నారు.జగన్ పై దాడి విషయంలో టీడీపీ సోషల్ మీడియా, లోకేశ్, అచ్చెన్నాయుడు రియాక్షన్ ఒక విధంగా ఉంటే చంద్రబాబు రియాక్షన్ మాత్రం మరో విధంగా ఉంది.

మోదీ( Modi ) ట్వీట్ వేసిన వెంటనే చంద్రబాబు జగన్ పై సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ వేయడం వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని తెలుస్తోంది.

జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఈరోజు కాకపోయినా రేపైనా దొరికే అవకాశం ఉంది.ఆ సమయంలో ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి( TDP ) చెందిన వ్యక్తి అని తేలితే టీడీపీకి కలిగే నష్టం అంతాఇంతా కాదు.జగన్ పై దాడిని ఖండిస్తూ ట్వీట్ చేయడం ద్వారా టీడీపీపై పెరుగుతున్న నెగిటివిటీని కొంచెమైనా తగ్గించాలని బాబు భావించారని తెలుస్తోంది.

Advertisement

మోదీ ఖండించిన తర్వాత తాను ఖండించకపోతే బీజేపీ నేతల ముందు చులకన అవుతామని కూడా బాబు ఫీలైనట్టు తెలుస్తోంది.ఈ దాడిలో తప్పు తమ పార్టీకి చెందిన వ్యక్తిదే అని తేలినా మిస్ ఫైర్ కాకుండా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు ఒకింత జాగ్రత్తతో వ్యవహరించారు.

అయితే టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కోడికత్తి డ్రామా 2 అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతున్న ట్వీట్ల వల్ల చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అర్థమవుతోంది.చంద్రబాబు తన ట్వీట్ లో దాడి చేసిన వాళ్లను శిక్షించాలని కోరకుండా సంబంధిత అధికారులను శిక్షించాలనే అర్థం వచ్చేలా చేసిన ట్వీట్లపై కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు