మా అమ్మ నాలో భాగం.. కెరీర్ లో సగభాగం.. అమ్మపై శ్రీలీల ప్రేమకు ఫిదా కావాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం లేకుండా శ్రీలీల( Sreeleela ) పేరు సమాధానంగా చెప్పవచ్చు.

స్టార్ హీరో అయిన మహేష్ బాబు( Mahesh babu ) నుంచి యంగ్ హీరో అయిన వైష్ణవ్ తేజ్ వరకు వరకు అందరు హీరోలు తమ సినిమాలలో హీరోయిన్ గా శ్రీలీలకు అవకాశం ఇస్తున్నారు.

మదర్స్ డే( Mathers day ) సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా అమ్మకు చాలా ఓపిక ఎక్కువని అమ్మగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని శ్రీలీల తెలిపారు.నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో ఏ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలో అమ్మకు తెలుసని శ్రీలీల అన్నారు.నా స్కూల్ డేస్ సమయంలో నేను బిజీగా ఉండేదానినని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కళ్లన్నీ నాపైనే ఉండటంతో అల్లరి చేసేదాన్ని కాదని శ్రీలీల వెల్లడించడం గమనార్హం.

Advertisement

తిండి విషయంలో నేను చిన్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించానని ఆమె పేర్కొన్నారు.నా విషయాలను నేనే హ్యాండిల్ చేయగలనని తెలిసిన తర్వాత అమ్మ నా ఫ్రెండ్ లా మారిపోయారని శ్రీలీల చెప్పుకొచ్చారు.మా అమ్మ మల్టీటాస్కర్ అని ఖాళీగా ఉండటం అమ్మకు అస్సలు నచ్చదని ఆమె కామెంట్లు చేశారు.

మా అమ్మను నేను సూపర్ ఉమెన్ అంటానని శ్రీలీల వెల్లడించారు.అమ్మ నాలెడ్జ్ సూపర్ అని మా అమ్మ నాలో భాగం అని నా కెరీర్ లో సగ భాగం అని ఆమె పేర్కొన్నారు.

నా కెరీర్ కు ఎంత సహాయం చేయాలో అంత సహాయం అమ్మ చేశారని నేను ప్రస్తుతం బిజీగా సినిమాలు చేస్తున్నానంటే అమ్మ సపోర్ట్ వల్లేనని శ్రీలీల అన్నారు.అమ్మపై శ్రీలీల చూపిస్తున్న ప్రేమకు ఫిదా కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు