సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.అయితే కైకాల సత్యనారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూలో టీడీపీ పుట్టుక వెనుక ఉన్న షాకింగ్ విషయాలను వెల్లడించారు.
రామారావుగారి దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఉండేదని రామారావు గారు చనిపోయే వరకు ఆయనతో అనుబంధం కొనసాగిందని కైకాల సత్యనారాయణ కామెంట్లు చేశారు.ముఖ్యమంత్రి ఆయ్యాక కూడా ఆయన మా ఇంటికి వచ్చేవారని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో టీడీపీ పెట్టానని ఎన్టీఆర్ చెప్పారని కైకాల తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ జాతకం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత లైన్ మార్చేయాలని ఉందని అందుకే ఆయన పాలిటిక్స్ వైపు అడుగులు వేశారని కైకాల అన్నారు.
ఆ సమయంలో కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి వెళ్లాలని సలహాలు ఇచ్చారని కైకాల సత్యనారాయణ వెల్లడించారు.
సరోజినీ పుల్లారెడ్డి గారు సీనియర్ ఎన్టీఆర్ రెండు గంటలు ఎదురుచూసినా సీనియర్ ఎన్టీఆర్ ను కలవకుండా అవమానించారని ఆ తర్వాత వెంకటరామిరెడ్డి గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ ను ఒక సందర్భంలో లోపలికి రానివ్వలేదని ఆ అవమానాల వల్లే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని కైకాల తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.

సీనియర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరింది.సీనియర్ ఎన్టీఆర్ పథకాలు ఈ జనరేషన్ ప్రజల్లో కూడా మంచి పథకాలుగా పేరు తెచ్చుకున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ సక్సెస్ ఫుల్ గా సినిమాల్లో, రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ కూడా ఉందనే సంగతి తెలిసిందే.







