టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన శరత్ బాబు( Sarath Babu ) హఠాన్మరణం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలలో నటించి తన నటనతో శరత్ బాబు ప్రేక్షకులను మెప్పించారు.
కొన్నిరోజుల క్రితం శరత్ బాబు అస్వస్థతకు గురయ్యారని ఆ సమయంలో వైద్యులు ఇన్ఫెక్షన్ ను గుర్తించారని సమాచారం.ఆ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బ తిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు( Multi Organ Failure ) దారి తీసిందని తెలుస్తోంది.
నిన్న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో శరత్ బాబు మృతి చెందారు.శరత్ బాబు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.శరత్ బాబు కీలక పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ నెల 26వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.మరోవైపు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చివరి మూవీ వసంత ముల్లై కావడం గమనార్హం.

హర్సిలీ హిల్స్ లో( Horsely Hills ) స్థిరపడాలనేది శరత్ బాబు చివరి కోరిక కాగా ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు.అక్కడ శరత్ బాబు ఇంటి నిర్మాణం కూడా చేపట్టగా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు.శరత్ బాబు మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.భాషతో సంబంధం లేకుండా ఎన్నో బలమైన పాత్రల్లో నటించి ఈ నటుడు మెప్పించారు.

రామరాజ్యం సినిమాతో హీరోగా శరత్ బాబు కెరీర్ మొదలు కాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆయన ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారు.కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి శరత్ బాబు మెప్పించారు.ఈ మధ్య కాలంలో వకీల్ సాబ్ సినిమాలో నటించిన పాత్ర శరత్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టింది.