స్టార్ హీరోయిన్ సమంత( Heroine Samantha ) హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఒకరు.దేశ విదేశాల్లో సమంత నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.సమంత ఒకవైపు సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.36 సంవత్సరాల వయస్సు ఉన్న సమంత ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారు.

కొత్త బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్( Brand Ambassador ) గా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యాడ్స్ ద్వారా కూడా సామ్ సత్తా చాటుతున్నారు.హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ఆమెకు ఖరీదైన ఇళ్లు ఉన్నాయని తెలుస్తోంది. సమంత ఇన్ స్టాగ్రామ్( Samantha Instagram ) లో ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పోస్ట్ చేస్తే 20 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.సూపర్ ఫుడ్( Superfood ) అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసిన సామ్ ఆ సంస్థ ద్వారా ఏడాదికి రెండు మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్టు బోగట్టా.

ఒక నేషనల్ మీడియా కథనం ప్రకారం ప్రస్తుతం సమంత ఆస్తుల విలువ 101 కోట్ల రుపాయలు( 101 Crores ) అని సమాచారం.సమంత దగ్గరైన ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే సమంత దగ్గర కొన్ని ఖరీదైన వస్తువులు ఉన్నాయి.సమంత గుచ్చి కంపెనీ హ్యాండ్ బ్యాగ్( Gucci Handbag ) వాడుతుండగా ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 1,40,000 రూపాయలు కావడం గమనార్హం.
సమంత దగ్గర బ్లహనిక్స్ బ్రాండ్ చెప్పులు ఉండగా ఈ చెప్పుల ఖరీదు లక్ష రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.సమంత ధరించే దుస్తుల విలువ కూడా లక్షల్లోనే ఉంటుందని తెలుస్తోంది.
ఆమె తన సొంత బ్రాండ్ కు సంబంధించిన దుస్తులను ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.ముంబైలో సమంత కొన్న ఇంటి విలువ 15 కోట్ల రూపాయలు అని సమాచారం.







