కోరమాండల్ రైలు ప్రమాదం( Coromandel Train Accident ) ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మృతి చెందారు.
సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ( Indian Railways ) వెల్లడించింది.కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాద ఘటనలో 900 మంది గాయాల పాలైనట్లు సమాచారం.
అయితే దశాబ్ద కాలంలో అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం.
ఈ ప్రమాదం గురించి ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్( Signaling System Failure ) కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నామని అన్నారు.అయితే ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను( Kavach ) ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కవచ్ వ్యవస్థ ఉంటే పట్టాలు బాగా లేకపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా ఆటోమేటిక్ గా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది.దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది.ఒడిశా రైలు ప్రమాదంలో ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి.తల్లి చనిపోవడంతో 14 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి తిరుగు ప్రయాణంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన తర్వాత లగ్జరీ రైళ్ల గురించి దృష్టి పెట్టడం కాదు సామాన్య ప్రజలు ప్రయాణించే రైళ్లపై దృష్టి పెట్టాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మన దేశంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు సమాధానం చెప్పాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రైలు ప్రమాద ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
