నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతికొద్ది మందిలో బ్రాహ్మణి ఒకరు.
పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని బ్రాహ్మణి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.అమ్మగా, హౌస్ వైఫ్ గా, బిజినెస్ ఉమెన్ గా వేర్వేరు రంగాలలో బ్రాహ్మణి సత్తా చాటుతున్నారు.
బాలయ్య కూతురు, చంద్రబాబు కోడలు అయిన బ్రాహ్మణికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం నారా బ్రాహ్మణి కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
బ్రాహ్మణి తాజాగా ది లద్దాఖ్ క్వెస్ట్ పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.బ్రాహ్మణి తెలుగు అనర్గళంగా మాట్లాడగలరు.
బ్రాహ్మణి స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న బ్రాహ్మణి ఈ సంస్థ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నారా బ్రాహ్మణి సమాజ సేవ విషయంలో కూడా ముందువరసలో ఉంటారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేర్వేరు అంశాలపై దృష్టి పెట్టిన బ్రాహ్మణి సమాజంలో మార్పు తీసుకొనిరావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
బ్రాహ్మణి మంచి వక్త కాగా ఈ విషయం ఆమె అభిమానులలో చాలామందికి తెలియదు.యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఛాప్టర్ లో ఆమె సభ్యురాలు కావడం గమనార్హం.బ్రాహ్మణి ప్రయాణాలను ఎంతగానో ఇష్టపడతారు.ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలలో నారా బ్రాహ్మణి స్పూర్తిని నింపుతున్నారు.నారా బ్రాహ్మణి ప్రతిభను చూసి నందమూరి బాలకృష్ణ అభిమానులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.