సినిమాలో నటించమని అడిగితే చెట్టెక్కి కూర్చున్న మహేష్.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలలో కఠినమైన సీన్లు ఉన్నాయి.అయితే ఆ సన్నివేశాలను మహేష్ సులువుగా చేస్తారనే సంగతి తెలిసిందే.

 Shocking Facts About Mahesh Babu Details Here Goes Viral , Mahesh Babu, Kodi Ram-TeluguStop.com

అయితే ఒక సినిమాలో మహేష్ ను నటించమని అడిగిన సమయంలో మహేష్ చెట్టెక్కి కూర్చున్నారు.స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కోడి రామకృష్ణ ఒక సందర్భంలో స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

కోడి రామకృష్ణ తన డైరెక్షన్ లో తెరకెక్కిన పోరాటం సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీలో మహేష్ పూర్తిస్థాయి బాలనటుడిగా నటించాడని అన్నారు.పోరాటం సెట్ కు మహేష్ వస్తుండేవాడని అప్పుడు మహేష్ చిన్న పిల్లాడని ఈ మూవీలో కృష్ణ చిన్న తమ్ముని రోల్ ఉందని ఆ రోల్ కు మహేష్ బాగుంటాడని అనిపించిందని కోడి రామకృష్ణ అన్నారు.

ఒకరోజు కృష్ణగారిని ఆ రోల్ కు మహేష్ బాగుంటాడని అడగగా వాడు ఎవరి మాట వినడని కృష్ణగారు చెప్పారని ఆయన తెలిపారు.

Telugu Krishna, Mahesh Babu, Poratem, Tollywood-Movie

మహేష్ సెట్ లో ఉన్న సమయంలో ఒక చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడని మహేష్ ను కలిసి బాబు నీకు సినిమాలో చేయాలని ఉందా అని అడిగానని ఎందుకు అని అడగగా సినిమాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని మా నాన్నగారిని చూస్తున్నాగా నేను అని అన్నానని మహేష్ చెప్పారని కోడి రామకృష్ణ ఒక సందర్భంలో తెలిపారు.నీ పాత్ర బాగుంటుందని చెప్పగా నేను చెయ్యను చెయ్యను అని మహేష్ చెట్టు ఎక్కాడని కోడి రామకృష్ణ పేర్కొన్నారు.

Telugu Krishna, Mahesh Babu, Poratem, Tollywood-Movie

ఆ తర్వాత మీ నాన్న ముఖం నీకే ఉందని కృష్ణ తమ్ముడి రోల్ లో నువ్వే బాగా చేయగలవని చెప్పి మహేష్ ను ఒప్పించానని ఆయన తెలిపారు.పోరాటం మూవీలో మహేష్ రోల్ బాగుంటుందని ఆ సినిమాలో మహేష్ కళ్లజోడు పగిలిపోయే సీన్ కు కన్నీళ్లు వస్తాయని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube