కొంతమంది నటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేయడంతో పాటు తమ పాత్రల ద్వారా భౌతికంగా మరణించినా నటించిన సినిమాల ద్వారా జీవించి ఉంటారు.ప్రముఖ నటుడు పద్మనాభం తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
ఈతరం ప్రేక్షకులకు పద్మనాభం గురించి ఎక్కువగా తెలియకపోయినా అప్పటి జనరేషన్ ప్రేక్షకులు మాత్రం పద్మనాభం నటనను ఎంతగానో ఇష్టపడతారు.
2010 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీన గుండెపోటుతో పద్మనాభం చెన్నైలో మృతి చెందారు.
నటుడిగా, కమెడియన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న పద్మనాభం రేలంగి తర్వాత ఆ స్థాయి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు.పద్మనాభంకు జోడీగా అప్పట్లో ఎంతోమంది హీరోయిన్లు నటించడంతో పాటు ఆయన స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.
ఆ తర్వాత కాలంలో పద్మనాభం నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టి నిర్మాతగా కూడా విజయాలను సొంతం చేసుకున్నారు.నటుడిగా పద్మనాభం ఎన్నో సినిమాలకు అవార్డులను సొంతం చేసుకున్నారు.
అయితే కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతగా పద్మనాభంకు నష్టాలను మిగిల్చాయి.కొంతమంది స్నేహితులు మోసం చేయడం వల్ల ఆస్తి కొట్టేయడం వల్ల ఆయనకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.
చివరి రోజుల్లో పద్మనాభం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో తక్కువ రెమ్యునరేషన్ కు పద్మనాభం నటించిన సందర్భాలు ఉన్నాయి.చివరి రోజుల్లో కొడుకు కూడా మోసం చేయడంతో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.పద్మనాభం నటుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించారు.మరణించే వరకు కూడా ఆయన సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.ఆయన సినీ కెరీర్ లో ఎన్నోఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు.
నటుడు పద్మనాభం సినిమాలలో ఎన్నో సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి రికార్డులు క్రియేట్ చేశాయి.