తరచు వర్షాలు కురుస్తుండడంతో ఈ సీజనల్ ల్లో వ్యాధులు ముప్పు ముందుంది.ఇప్పటికే మహానగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
జ్వరం తో పాటు ఒళ్ళు నొప్పులు ఇతర లక్షణాలు కనిపించడంతో అది కోవిడ్ అయ్యే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం వల్ల బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
క్రితం ఏడాది వర్షాకాలంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు భౌతిక దూరం పాటించడం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా పోయింది.మళ్లీ పాత పరిస్థితుల నేపథ్యంలో జన సమర్థం ఎక్కడికక్కడ కనిపిస్తుంది.
దీని వల్ల మళ్లీ అంటువ్యాధులు ప్రమాదం పెరిగింది.కోవిడ్ ను, సాధారణ విష జ్వరాలను వేరువేరుగా గుర్తించడంలో తేడా జరిగితే భారీ మూల్యం చెల్లించల్సి వస్తుంది.
ఈ అంశాలపై అటు ప్రజలతో పాటు వైద్యులు సైతం అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది.నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెంది రోగాలకు కారణం అవుతున్నాయి.
డెంగ్యు వ్యాది వ్యాప్తి వర్షాకాలం తర్వాత ఎక్కువగా ఉంటుంది.మలేరియా మనదేశంలో ప్రధానమైన.
అటవీ, గిరిజన ప్రాంతాల్లో మలేరియా ప్రభావం అధికం.ప్రజా ఆరోగ్య వ్యవస్థను సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ లోపాలవల్ల పట్టణాల్లో, నగరాల్లో మలేరియా విజృంభిస్తుంది.
జూలై నుంచి నవంబర్ మధ్య మనదేశంలో మలేరియా తీవ్రరూపం దాలుస్తుంది.మందులకు లొంగని మలేరియా కేసులు ఊపిరితిత్తుల సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్నాయి.
తక్కువ మోతాదులో లేదా తక్కువ కాలం మాత్రమే మందులను వాడితే వ్యాధి తగ్గిన పరిస్థితి నెలకొంటుంది.ఆరోగ్యకర పరిసరాలు వ్యక్తిగత పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి.టైఫాయిడ్ కు చక్కని ఔషధాలు అందుబాటులో ఉన్న ఏటా రెండు లక్షల మందికి పైగా దీని బారినపడి ప్రాణాలు వదులుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.ఏడాది పొడవునా టైఫాయిడ్ సాధారణ వ్యాధుల కంటబడినా వర్షాకాలంలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
దోమకాటుతో చికెన్ గున్యాతో పాటు కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు.బ్రుసెల్లోసిస్ వంటి జ్వరాలు కూడా ఈ సీజన్లో అధికంగా వస్తాయి.వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.చుట్టూ ఉన్న కాలువల్లో పూడికలు లేకుండా చూసుకోవాలి.కోవిడ్ లక్షణాలతోపాటు సీజనల్ జ్వరాలు గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలి.జ్వరం వచ్చినప్పుడు తక్షణం వైద్యులను సంప్రదించడం వల్ల ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.