రతిక కూడా రైతుబిడ్డే.. స్కూల్ ఫీజులు కట్టలేని స్థితి నుంచి ఈ స్థాయికి.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లీదండ్రులు!

బిగ్ బాస్ హౌస్ నుంచి అందరూ ఊహించిన విధంగానే రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు.

హౌస్ లో ఇష్టానుసారం ప్రవర్తించిన తీరు వల్లే రతిక ఎలిమినేట్ కావడం జరిగింది.

అయితే రతిక ఎలిమినేట్ కావడంతో ఆమె తల్లీదండ్రులు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.రతిక తండ్రి రాములు ఒకప్పుడు వ్యవసాయం చేసేవారట.

ప్రస్తుతం కూతురు కోరిక మేరకు హైదరాబాద్ లో ఉంటున్నారు.

రతిక తల్లీదండ్రులు మాట్లాడుతూ ఆమె అసలు పేరు ప్రియ అని తెలంగాణలోని తాండూర్ స్వస్థలం అని తెలిపారు.ఒకప్పుడు రతిక స్కూల్ ఫీజులు కూడా కట్టలేక ఇబ్బంది పడ్డానని నవోదయ స్కూల్ లో సీటు రావడంతో రతికను చదివించానని రాములు అన్నారు.తాను గ్రామ సర్పంచ్ గా పని చేశానని అయితే బిడ్డల కోసం ఏం సంపాదించలేదని రాములు తెలిపారు.

Advertisement

మంత్రి మల్లారెడ్డి రతికకు మెరిట్ ఉండటంతో బీటెక్ లో ఫ్రీ సీట్ ఇచ్చాడని చెప్పారు.రతికది చిన్నపిల్లల మనస్తత్వం అని నాకు ఇద్దరూ మగపిల్లలే అని రాములు తెలిపారు.

పెద్దమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందని రతిక అమ్మాయైనా అబ్బాయిలా కుటుంబాన్ని నిలబెట్టిందని రాములు అన్నారు.తుపాకి రాముడు సినిమాలో నటించడంతో రతికకు సినిమా ఆఫర్లు వచ్చాయని రతిక ఎవరినీ ప్రేమించలేదని రాములు తెలిపారు.

తమకు ఉన్న కొద్దిపాటి భూమిలో ఇప్పటికీ వారంలో మూడు రోజులు వ్యవసాయం చేస్తున్నామని రాములు అన్నారు.

మరోవైపు వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో సాయి పావని రాజు( Sai Pavani Raju ) బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ఇష్టానుసారం చేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తన ఎలిమినేషన్ గురించి రతికా రోజ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు