లోక్ సభ ఎన్నికల ( Lokh Sabha Elections ) కు మరికొన్ని రోజులు ఉన్న తరుణంలో ప్రధాన పార్టీలలో ఉన్న నాయకులందరికీ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇక బిజెపిలో అయితే పేరున్న చాలా మంది సీనియర్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
దాంతో వారదృష్టి మొత్తం ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల మీదే ఉంది.ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్( Bandi Sanjay ) , రఘునందన్ రావులు ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలి అని భావిస్తున్నారు.

అయితే లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో బిజెపి పార్టీలో కీలక నాయకుడుగా ఉన్న రఘునందన్ రావు ( Raghunandan Rao) కి షాక్ తగిలింది.దుబ్బాక నుండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘునందన్ రావుకి అక్కడి ప్రజలు పట్టం కట్టలేదు.దాంతో అక్కడ ఓడిపోయారు.అయితే ప్రస్తుతం ఆయనకి లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ( Medak) సీటు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే సొంత పార్టీలో ఉన్న నాయకులే ఆయనపై వ్యతిరేకంగా ఉన్నారట.

మరీ ముఖ్యంగా సొంత పార్టీలో ఉన్న కీలక నాయకులు ఆయనకు ఎంపీ సీటు ఇవ్వద్దని అధిష్టానానికి చెబుతున్నట్టు సమాచారం.దాంతో మెదక్ ఎంపీ సీటు (Medak MP Seat) ను రఘునందన్ రావుకి ఇవ్వకూడదని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే పార్టీపై, పార్టీ నాయకుల పై విమర్శలు చేసిన వారికి పార్టీలో చోటు ఉండదు అని,అందుకే ఆయనకు ఎంపి సీటు ఇవ్వకూడదని కొంతమంది నాయకులు అధిష్టానానికి తెలియజేశారట.
అయితే ఈసారి కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలుస్తారు.అయితే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు కూడా ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారన్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే రఘునందన్ రావుని మెదక్ లో పక్కన పెడితే ఈటెల రాజేందర్ ( Etela Rajender) కి మెదక్ ఎంపీ సీటును ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.