ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ( Janasena Party )కి మరో షాక్ తగిలింది.ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీవీ రావు( BV Rao ) పార్టీని వీడారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పంపించారు.పార్టీ అభివృద్ధి కోసం ఇన్నేళ్లుగా పని చేస్తే మిగిలిందేమీ లేదని చెప్పారు.
పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గ టికెట్ ను బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కామినేని శ్రీనివాస్( Kamineni Srinivas ) టీడీపీ వాళ్లను మాత్రమే కలుపుకుని పోతున్నారని బీవీ రావు చెబుతున్నారు.
నియోజకవర్గంలో జనసేన ఉండకూడదని కామినేని ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనను పిలుస్తారని చూసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే పార్టీని వీడినట్లు వెల్లడించారు.