Amardeep Shobha Shetty : అమర్ కోసం స్టార్ హీరో ఇచ్చిన గిఫ్ట్ త్యాగం చేసిన శోభ.. సంతోషంలో అమర్!

అమర్ దీప్ చౌదరి( Amardeep Chowdary ) పరిచయం అవసరం లేని పేరు.బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

 Shobha Shetty Gives Surprise Gift To Amardeep-TeluguStop.com

ఈ కార్యక్రమంలోకి ఈయనతో పాటు మరో బుల్లితెర సెలబ్రిటీ అయినటువంటి శోభా శెట్టి( Shobha Shetty ) అలాగే ప్రియాంక జైన్ కూడా వెళ్లారు.ఈ ముగ్గురు హౌస్ లో ఒక బ్యాచ్ గా ఉండి చివరి వరకు ఆటను కొనసాగించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ హౌస్ లో కొనసాగే సమయంలో నాగార్జున( Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు సీజన్లో కంటే మరింత సక్సెస్ చేశారు.

Telugu Bigg Boss, Biggboss, Nagarjuna, Shobha Shetty, Shobhashetty-Movie

ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున వేసుకొని వచ్చే షర్ట్స్ చాలా భిన్నంగా అందరిని ఆకర్షిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఓసారి శోభ శెట్టి సర్ మీ టీ షర్ట్ చాలా బాగా ఉంది నాకు ఇవ్వండి అంటూ అడిగింది.ఇక ఆమె అడగడంతో నాగార్జున కూడా కాదనలేక షో పూర్తి కాగానే తనకు ఆ టీషర్ట్ ఇచ్చారు.

టీషర్ట్( Nagarjuna T-Shirt ) ధరించి ఈమె ఫోటోషూట్ కూడా చేశారు.మరొక వారంలో అమర్ కూడా నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని తనకు ఇవ్వమని అడగగా నాగార్జున మాత్రం ముందు నువ్వు కూర్చో అంటూ తనకు టీ షర్ట్ ఇవ్వలేకపోయారు.

Telugu Bigg Boss, Biggboss, Nagarjuna, Shobha Shetty, Shobhashetty-Movie

తాజాగా బిగ్ బాస్ ఉత్సవం( Bigg Boss Utsavam ) పేరిట మరో కార్యక్రమం ప్రసారం కాబోతోంది.ఈ కార్యక్రమంలో సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున శోభాకు ఇచ్చినటువంటి టీ షర్ట్ అమర్ కు త్యాగం చేశారు.ఇది నాకు ఎంతో విలువైన బహుమతి కానీ ఆరోజు నాగ్ సర్ ను అమర్ అడిగాడు కాబట్టి నేను తనకు ఈ షర్ట్ ఇస్తున్నాను అంటూ ఈమె తనకోసం ఇచ్చిన గిఫ్ట్ అమర్ కు ఇచ్చేశారు.

అమర్ ఈ షర్ట్ తీసుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా స్టేజ్ పైన వేసుకొని తెగ సంబరపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube