నాటు నాటు ఒక పాటేనా.. సంగీతం ఉందా.. కీరవాణి తండ్రి షాకింగ్ కామెంట్స్!

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్( Oscar Award ) రావడంతో సామాన్య ప్రజలు సైతం ఈ సాంగ్ ను ప్రశంసిస్తున్నారు.

యూట్యూబ్ లో ఈ సాంగ్ వ్యూస్ రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.ఈ సాంగ్ గురించి ఎవరైనా ట్రోల్స్ చేస్తే ఎన్టీఆర్, చరణ్( NTR, Charan ) అభిమానులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

అయితే కీరవాణి( Keeravani ) తండ్రి శివశక్తిదత్తా తాజాగా ఈ సాంగ్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.కీరవాణి తండ్రి నుంచి ఈ తరహా కామెంట్లు వస్తాయని నెటిజన్లు సైతం నమ్మలేకపోతున్నారు.

నాటు నాటులో సంగీతం ఎక్కడుందని ఆయన అన్నారు.కీరవాణి నా పంచ ప్రాణాలు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

మూడో సంవత్సరం నుంచే కీరవాణి మ్యూజిక్ నేర్చుకున్నాడని శివశక్తిదత్తా చెప్పుకొచ్చారు.

కీరవాణి ప్రతిభను చూసి ఆశ్చర్యపోతుంటానని శివశక్తిదత్తా కామెంట్లు చేశారు.నాటు నాటు సాంగ్( Natu Natu Song ) నాకు నచ్చలేదని అది ఒక పాటేనా అని ఆయన ప్రశ్నించారు.ఆ పాటలో మ్యూజిక్ ఎక్కడుందని విధి విచిత్ర వైచిత్యం ఇది అని శివశక్తిదత్తా కామెంట్లు చేశారు.

ఇన్నిరోజులు కీరవాణి పడ్డ కష్టానికి ఈ రూపంలో ఫలితం దక్కిందని ఆయన తెలిపారు.చంద్రబోస్ 5 వేల పాటలలో ఇది ఒక పాట అని ఆయన అన్నారు.

కీరవాణి ఇచ్చిన సంగీతంలో ఇదొక మ్యూజికేనా అని శివశక్తిదత్తా కామెంట్లు చేశారు.తారక్, చరణ్ డ్యాన్స్ మహద్భుతమని ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.వీళ కృషి వల్ల ఆస్కార్ అవార్డ్ ను పొందడం గర్వించదగిన విషయమని శివశక్తిదత్తా కామెంట్లు చేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు