చూపు లేకపోయినా ఐఐఎం పరీక్షలో ప్రతిభ చూపిన యువతి.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

కంటిచూపు లేకపోతే నిత్యం ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.అలాంటి కంటిచూపు లేని వ్యక్తులు లక్ష్యాలను సాధించాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి.

అయితే కంటిచూపు లేకపోయినా ఒక యువతి మాత్రం ఐఐఎం పరీక్షలో సత్తా చాటి ప్రశంసలు పొందుతోంది.దేశంలో 21 ఐఐఎం కళాశాలలు( IIM Colleges ) ఉండగా 19 కళాశాలల్లో అర్హత సాధించిందంటే ఈ యువతి ప్రతిభ ఏపాటిదో అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పట్టణం గుడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని( shivani ) సక్సెస్ స్టోరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.మాది వ్యవసాయ కుటుంబం అని అక్క గ్రూప్4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించిందని ఆమె పేర్కొన్నారు.

మా చెల్లి భవానికి సైతం 80 శాతం చూపు లేదని శివాని తెలిపారు.చెల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు సాధించిందని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

నాకు పుట్టుకతోనే చూపు లేకపోయినా చదువంటే ఎంతో ఆసక్తి అని ఆమె కామెంట్లు చేశారు.చదువే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మా నమ్మకమని శివాని పేర్కొన్నారు.జహీరాబాద్ లోని సరస్వతీ శిశుమందిర్ లో నేను ప్రైమరీ చదువు చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

పదో తరగతిలో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని ఆమె వెల్లడించారు.ఇంటర్ చదివే సమయంలో రెండేళ్లు కాలేజ్ టాపర్ గా నిలిచానని శివాని వెల్లడించారు.

చెన్నైలో బీబీఏ కోర్స్( BBA course ) పూర్తి చేశానని ఆమె చెప్పుకొచ్చారు.చూపు లేకపోవడంతో చదువుకోవడం కోసం ఎంతో కష్టపడ్డానని శివాని వెల్లడించారు.కార్పొరేట్ కంపెనీలలో టాప్ లెవెల్ జాబ్ చేయాలని భావిస్తున్నానని ఆమె తెలిపారు.

అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టడమే నా లక్ష్యమని శివాని పేర్కొన్నారు.శివాని కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..

ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు