ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నెటిజెన్స్ అభిప్రాయం ప్రకారం హౌస్ లో మోస్ట్ కన్నింగ్ క్యారక్టర్ ఎవరిదీ అంటే అది శివాజీ అని ముక్తకంఠం తో చెప్పేస్తున్నారు.రోజు రోజుకు ఆయన ప్రవర్తన ని చూసి నెటిజెన్స్ చాలా తీవ్రస్థాయిలో అసహ్యించుకుంటున్నారు.
మొదటి నుండి ఈయన కేవలం పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మరియు యావర్ ని ప్రత్యేకంగా చూస్తూ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి ఈయన క్రింద ఉండేలా పెట్టుకున్నాడు.యావర్ తన సొంత ఆటని ఆడుతూ వచ్చి ఉంటే కచ్చితంగా టాప్ 5 లో ఎదో ఒక స్థానం లో ఉండేవాడని, కానీ ఇప్పుడు టాప్ 5 లో ఉండడం దాదాపుగా అసాధ్యం అంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
అంతే కాకుండా అశ్విని, భోలే, రతికా వంటి కంటెస్టెంట్స్ ని కూడా తన మాయ మాటలతో ప్రభావితం చేస్తున్నాడని, అమర్ మీద ఈయనకి ఉన్న కుళ్ళు చూస్తుంటే అసలు ఇతను ఏమి మనిషి అంటూ నెటిజెన్స్ తిట్టిపోస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే శివాజీ( Shivaji ) నోటి నుండి వచ్చే కొన్ని మాటలు ఆడియన్స్ కి పిచ్చి కోపం రప్పించేలా చేస్తున్నాయి.ప్రతీ సోమవారం జరిగే నామినేషన్స్ లో ఎవరైనా శివాజీ ని నామినేట్ చేస్తే ఆరోజు మొత్తం శివాజీ ఆ కంటెస్టెంట్ మీద ఏడుస్తూనే ఉంటాడు అని అంటున్నారు నెటిజెన్స్.ముఖ్యంగా ఈ వారం కెప్టెన్ ప్రియాంక ( Priyanka Jain )పై శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయి, మనిషిగా ఆయన స్థాయిని మరింత దిగజార్చే విధంగా ఆయన ప్రవర్తించాడు అంటూ చెప్పుకొస్తున్నారు.
తనని నామినేట్ చేసినందుకు నువ్వు మొదటి నుండి ఇంతే, చెయ్యాల్సింది చేస్తావు, నీ రంగుల మార్చే తత్త్వం గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఇక మారవు అంటూ ప్రియాంక మీద మాటలు వదిలేసాడు.అసలు నేను చేసిన తప్పేమిటి అని ప్రియాంక అడగగా, దానికి మాత్రం ఈయన సమాధానం చెప్పను అంటూ మాట దాటవేసాడు.

ఆ తర్వాత ప్రియాంక గురించి తన గ్యాంగ్ మొత్తం తో చెడుగా మాట్లాడుతూ అసలు ఆమెకి క్యారక్టర్ లేదు అనే ముద్ర వేసాడు.ఇతని మాటలకు ప్రభావితమైన అశ్వినీ, అసలు జనాలు ఏమి చూస్తున్నారు బిగ్ బాస్ ని?, ఈమె క్యారక్టర్ అసలు కనిపించడం లేదా? అంటూ ఆమె మీద నిందలు వేసింది.ఇలా శివాజీ అందరి మైండ్ సెట్ పై ప్రభావం చూపుతూ తనకు ఇష్టం లేని వారిపై తన చుట్టూ పక్కన ఉన్నవాళ్ళకి లేనిపోని నెగటివిటీ ని నింపి వాళ్ళ మైండ్ సెట్ పై ప్రభావం చూపిస్తున్నాడని, ఇంత కుట్రలు కుతంత్రాలు చేసే కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హిస్టరీ లోనే చూడలేదంటూ నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.