బిగ్ బాస్ హౌస్ నుండి శివాజీ అవుట్..15 లక్షలతో బయటకి వచ్చిన యావర్!

ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఇన్ని వారాలు ఊహించని మలుపులతో ‘ఉల్టా పల్టా’ సీజన్ గా కొనసాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో నుండి హౌస్ మేట్స్ అందరూ ఎలిమినేట్ అవ్వగా, చివరికి గ్రాండ్ ఫినాలే కి అర్జున్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్ మరియు శివాజీ చేరుకున్నారు.

 Shivaji Is Out Of The Bigg Boss House.. Yavar Who Came Out With 15 Lakhs! , Big-TeluguStop.com

రేపు ప్రసారం అవ్వబొయ్యే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్(Bigg Boss 7 Grand Finale ) కి సంబంధించిన షూటింగ్ ఈరోజు ఉదయం నుండే ప్రారంభం అయ్యింది.ఈ షూటింగ్ లైవ్ అప్డేట్ ప్రకారం అర్జున్ అంబటి( Ambati Arjun ) టాప్ 6 స్థానం లో ఎలిమినేట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

టాప్ 6 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ 10 లక్షల రూపాయిల ఆఫర్ ని ఇస్తాడు.అర్జున్ కి తానూ చివరి స్థానం లో ఉన్నాడు అనే విషయం అతనికి తెలుసు.

Telugu Ambati Arjun, Biggboss, Bigg Boss Show, Prince Yawar, Ravi Teja, Shivaji-

కానీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు.ఇది ఆయన అభిమానులకు మరియు చూసే ఆడియన్స్ కి అసలు నచ్చలేదు.ఎందుకంటే అర్జున్ హౌస్ లోకి వచ్చిన రోజు నుండి చివరి వారం వరకు ప్రతీ టాస్కుని ఎంతో అద్భుతంగా ఆడుతూ వచ్చాడు.ఆయన కష్టానికి తగ్గట్టుగా 10 లక్షల రూపాయిలను తీసుకొని ఉంది ఉంటే చాలా బాగుండేది అనిపించింది.

ఇక టాప్ 5 వ స్థానం లో ప్రియాంక నిల్చింది.ఈమెని గ్రాండ్ ఫినాలే కి ఒక అతిధిగా వచ్చిన రవితేజ( Ravi Teja ) బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లి తీసుకొస్తాడు.

ఇక చివరికి మిగిలింది నలుగురు.ఈ నలుగురు కంటెస్టెంట్స్ కి నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు.మీలో ఎవరో ఒకరు 15 లక్షల రూపాయిల సూట్ కేసు ని తీసుకొని బయటకి రావొచ్చు అని అంటాడు.ఈ ఆఫర్ కి యావర్( Prince Yawar) ఒప్పుకొని 15 లక్షల రూపాయలతో బయటకి వస్తాడు.

Telugu Ambati Arjun, Biggboss, Bigg Boss Show, Prince Yawar, Ravi Teja, Shivaji-

ఇక చివరికి మిగిలింది ముగ్గురు.అమర్ దీప్, ప్రశాంత్ మరియు శివాజీ.ఈ ముగ్గురిలో శివాజీ ( Shivaji )మూడవ స్థానం లో ఎలిమినేట్ అయ్యి బయటకి వస్తాడు.ఇక్కడితో ఈరోజు షూటింగ్ పూర్తి అయ్యింది.ఇక హౌస్ మిగిలింది కేవలం అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మాత్రమే.ఈ ఇద్దరిలో ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది రేపు తెలుస్తాది.

ఓటింగ్ ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్ గెలిచాడని అంటున్నారు.కానీ టాప్ 2 కంటెస్టెంట్స్ కి కూడా నాగార్జున ఎదో ఒక ఆఫర్ ఇస్తాడు.

ఎవరు ఆ ఆఫర్ ని ఒప్పుకుంటే వాళ్ళు రన్నర్ గా నిలుస్తారు.చూడాలి మరి రేపు ఏమి జరగబోతుందో అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube