పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే ప్రముఖ నటుడు, బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ తాను పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తానంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనతో పాటు తన ఫ్యామిలీ కూడా పవన్ కే సపోర్ట్ చేస్తుందని శివ బాలాజీ అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానినని శివ బాలాజీ పేర్కొన్నారు.పాలిటిక్స్ పై నాకు ఆసక్తి లేదని భవిష్యత్తులో కూడా పాలిటిక్స్ లోకి రానని ఆయన కామెంట్లు చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ చెబితే మాత్రం జనసేన తరపున యాక్టివ్ గా పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని శివ బాలాజీ కామెంట్లు చేశారు.
సోషల్ మీడియా ద్వారా పవన్ గెలుపు కోసం నూటికి నూరు శాతం కష్టపడతామని శివ బాలాజీ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే ఆయనకు కోట్ల రూపాయల పారితోషికం దక్కుతుందని పవన్ కు ఓపిక ఎక్కువని అయన కామెంట్లు చేశారు.పవన్ శివ బాలాజీ కాంబినేషన్ లో కాటమరాయుడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శివ బాలాజీ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.శివబాలాజీ కామెంట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సినిమా రంగం ప్రముఖుల నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.పవన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో హీరోగా బిజీగా ఉన్నారు.