హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో( Old City ) శివలింగం రూపులో ఉన్న కారు చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది.ఈ మేరకు బహదూర్ పురాలోని సుధాకర్ మ్యూజియం( Sudhakar Museum ) ఆధ్వర్యంలో కారు తయారైందని తెలుస్తోంది.
దాదాపు సంవత్సరం పాటు ఏడుగురు సిబ్బంది ఈ కారును తయారు చేశారని సమాచారం.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రోడ్లపై పరుగులు తీస్తున్న ఈ శివలింగం తరహా కారును నగర వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.







