తక్కువ సినిమాల్లోనే నటించినా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో శివకార్తికేయన్ ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగులో కూడా శివకార్తికేయన్ కు మంచి పేరు ఉంది.
శివ కార్తికేయన్ గత సినిమా డాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చడంతో పాటు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే వరుస విజయాలతో జోరుమీదున్న శివ కార్తికేయన్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.ప్రస్తుతం శివ కార్తికేయన్ కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రిన్స్ అనే సినిమాలో నటిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని శివ కార్తికేయన్ ప్రముఖ ఓటీటీ సంస్థతో మాట్లాడి ఈ డీల్ సెట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
మరోవైపు శివ కార్తికేయన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కథ మరీ అద్భుతంగా ఉన్న ప్రాజెక్ట్ లకు మాత్రమే ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా శివ కార్తికేయన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.శివ కార్తికేయన్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
శివ కార్తికేయన్ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ఆయన పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.