నా భార్య డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్ : శివ బాలాజీ

భార్య భర్తల్లో ఎవరో ఒకరు మాత్రమే ఉంటే ఆ సంసార జీవితం సరిగా సాగదు ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తేనే గమ్యం చేరుకుంటారు.

అయితే భర్త లేదా భార్య అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.

మగవారి సంపాదిస్తే ఆడవారు ఇల్లు చక్కబెట్టాలి అనే సూత్రం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు ఇద్దరు సంపాదిస్తున్నారు అలాగే సంసారాన్ని చక్కగా నడిపిస్తున్నారు అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే సెలబ్రెటీ మాత్రం తను కుటుంబాన్ని అలాగే వ్యవహారాలన్నీ కూడా మెయింటైన్ చేయలేను అంటున్నారు.ఆ సెలబ్రిటీ మరెవరో కాదు నటుడు మరియు బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివ బాలాజీ.

శివ బాలాజీ, మధుమిత అనే తన తోటి నటిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

శివ బాలాజీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు.ఇక మధుమిత మాత్రం తన కుటుంబాన్ని, అలాగే శివ బాలాజీ కి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది.

Advertisement

పెళ్లి కాకముందు ఆమె నటిగా కొన్ని సినిమాల్లో కనిపించింది.పెళ్లయ్యాక పూర్తిగా ఇంటికి పరిమితం అయింది.

ఇక శివ బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

అలాగే శివ బాలాజీ కుటుంబం మొదటి నుంచి వ్యాపారంలో ఉన్నారు.అయితే శివకి మాత్రం కుటుంబాన్ని నడిపించడం అస్సలు తెలీదు అంటాడు.అంతేకాదు డబ్బు కూడా పొదుపు చేయలేనని ఒప్పుకుంటాడు.

ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా ఇచ్చే తత్వం తనది అని మీడియా ముందు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.అలా చేయడం వల్ల కొన్నిసార్లు కొంత మంది చేతిలో మోసపోయానని అందుకే తన అన్ని పనులు తన భార్యకే అప్పగించేసానని, మధు అయితే ఒకటికి పది సార్లు అన్ని చెక్ చేసుకొని చేస్తుందని, తన భార్యపై తనకు ఎంతో నమ్మకం అంటూ చెప్తున్నాడు శివ బాలాజీ..

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు