కెనడా ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై కుప్పలుగా ఈల్ చేపలు.. వీడియో చూస్తే షాకే...

కెనడా ఎయిర్‌పోర్ట్‌లో ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది.

టొరంటో నుంచి వ్యాంకోవర్‌కు బయలుదేరిన ఎయిర్ కెనడా కార్గో విమానంలో( Air Canada Cargo Flight ) ఒక కంటైనర్ మూత ఓపెన్ అయ్యింది.

ఇంకేముంది అందులో లోడ్ చేసిన ఈల్స్( Eels ) బయటికి వచ్చి పడ్డాయి.డెలివరీ సమయంలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది.

విమానం వ్యాంకోవర్‌లో( Vancouver ) దిగిన తర్వాత, కంటైనర్ లోడ్ చేస్తున్న సమయంలో ఒక బాక్స్ తెరుచుకుంది.అంతే దాదాపు 20 ఈల్స్ బయటకు పారిపోయాయి.

తారు రోడ్డుపై ఈల్స్ చాలా సేపు అటు ఇటు తిరుగుతూ చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.ఈ సంఘటనను వీడియో రికార్డ్ చేశారు.

Advertisement

అది కాస్త ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

ఎయిర్ కెనడా కార్గో ఈ సంఘటనకు క్షమాపణలు తెలిపింది.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేసింది.ఈల్స్‌ను తిరిగి పట్టుకున్నట్లు, వాటిని సురక్షితంగా ప్యాక్ చేసి కస్టమర్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

"విమానాశ్రయంలో సరుకులను దించే సమయంలో ఒక బాక్స్ తెరుచుకుని, కొన్ని ఈల్స్ బయటకు పారిపోయాయి.వాటిని తిరిగి పట్టుకుని సురక్షితంగా ప్యాక్ చేశాము," అని వ్యాంకోవర్ విమానాశ్రయం (YVR)కి చెందిన కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ టాన్యా క్రౌవెల్ తెలిపారు.ఈ సంఘటన వల్ల ఎవరికీ గాయాలు కాలేదు, విమానాశ్రయ కార్యకలాపాలు కూడా ప్రభావితం కాలేదు.

ఈల్స్ సర్పంలా పొడవుగా, సన్నగా ఉండే చేపలు.చాలా ఈల్స్ చిన్న సముద్రపు నీటిలో నివసిస్తాయి, ఇక్కడ అవి ఇసుకలోకి వెళ్లి దాక్కుంటాయి.

క్యారెక్టర్స్ అంటూ నీచంగా మాట్లాడిన విష్ణు ప్రియ... ఇదే అస్సలు బాగోతం
జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 

ఈల్స్‌కు పొట్ట కింద ఈత కొట్టే చిన్న రెక్కలు ఉండవు, చాలా జాతులకు ఛాతీ రెక్కలు కూడా ఉండవు.

Advertisement

తాజా వార్తలు