టర్కీ సముద్రంలో మునిగిన భారీ ఓడ... వీడియో వైరల్...

ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.చాలా ఎక్కువ ప్రమాదాలు రోడ్లపై జరుగుతూ ఉంటాయి.

తక్కువ ప్రమాదాలు మాత్రమే నీటిలో కూడా జరుగుతూ ఉంటాయి.అలాంటి కొన్ని ప్రమాదాలు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి.

అలాంటి ఒక ఆశ్చర్యకరమైన ప్రమాదం టర్కీ సముద్రంలో జరిగింది.టర్కీ సముద్రంలో ఒక భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా మునిగిపోయింది.

ఈ ప్రమాదం టర్కీలోని ఒక పోర్ట్ లో ఓడలోనీ కంటైనర్లను అన్లోడ్ చేస్తుండగా అంతలోనే ఆ ఓడ ముందుకి కదిలి ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది.దానితో అక్కడ ఉన్న పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

Advertisement

సి ఈగల్ అనే ఈ కార్గో ఓడ ఈజిప్టుకి చెందినది.అయితే ఈ ప్రమాదం గురించి టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా ఈ ఓడ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఓడలో ఇంకా 24 కంటైనర్లు మునిగిపోయాయని మెసేజ్ ను పోస్ట్ చేసింది.

ఆ ఓడలోని కొద్దిగా చమురు కూడా లీక్ అయినట్లు తెలిపింది.ఓడలోని కంటైనర్లను అన్లోడ్ చేస్తున్న ఆ పోర్ట్ సిబ్బందికి అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఓడ లో గత కొంతకాలంగా స్థిరత్వానికి సంబంధించిన విషయంలో సమస్యలు ఉన్నాయి.ఈ ఓడ సెప్టెంబర్‌ 17న టర్కీలోని ఒక పోర్ట్‌కి చేరుకుంది.

ఆ పోర్ట్ లోనే ఈ ప్రమాదం జరిగింది.ఈ ఓడను 1984 ఈజిప్టులో తయారు చేశారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!

ప్రస్తుతం ఈ ఓడను సముద్రం లోపల నుండి వెలికితీసే పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు పోర్ట్ లోని కొంతమంది సిబ్బంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తాజా వార్తలు