శిల్పా శెట్టి లగ్జరీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని కోట్ల ఖరీదు అంటే?

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే.

 Shilpa Shetty Gifts Herself Vanity Van Her 47th Birthday, Shilpa Shetty, Bollywo-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.ఇక శిల్ప శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఈ విషయంలో అరెస్టయినప్పుడు శిల్పా శెట్టి పేరు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా శిల్పా శెట్టి జూన్ 8న 47 పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.

తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానుగా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చుకుంది.లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను తన సొంతం చేసుకుంది.బ్లాక్‌ కలర్‌లో ఉన్న ఈ వ్యాన్‌లో సకల సదుపాయాలతో పాటు లోపల లగ్జరీ గా ఉండేలా చూసుకుంది. ఆ వ్యాన్ లోనే కిచెన్‌, హెయిర్‌ వాష్‌ రూమ్‌, యోగా డెక్‌ సహా అన్ని సదుపాయాలను అమర్చుకుంది.

ఇకపోతే శిల్ప ఎక్కువగా ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తుంది తెలిసిందే.అయితే ఫిట్‌నెస్‌ కు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే శిల్పా శెట్టి ప్రయాణం చేసేటప్పుడు కూడా సమయం వృథా అవ్వకూడదు అని యోగా చేసేందుకే యోగా డెక్‌ను కూడా అరేంజ్‌ చేసుకుందట.

ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి.ఈ వ్యాన్ లోపల ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్‌ ను తయారు చేయించుకుంది.ఇకపోతే శిల్పాశెట్టి సినిమాల విషయానికి వస్తే.శిల్పా శెట్టి నటించిన నికమ్మ చిత్రం జూన్‌ 17న రిలీజవుతోంది.అలాగే రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో ఓటీటీలోనూ అడుగు పెట్టనుంది శిల్ప.రోహిత్‌ శెట్టి ఈసారి శిల్పాశెట్టిని పోలీస్‌గా వెండితెరపై ప్రజెంట్‌ చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube