విలక్షణ చిత్రాలను ప్రేక్షకులకు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల( Shekhar Kammula ).ఈయన నుంచి ఫిదా మరియు లవ్ స్టోరీ సినిమా లు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు.
దాంతో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యి ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో శేఖర్ కమ్ముల కనిపించక పోవడం తో ఇక సినిమా పనై పోయిందని అంతా అనుకున్నారు.
కానీ సినిమా గురించి అనూహ్యంగా కొత్త ప్రకటన వచ్చింది.సినిమా ను వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభించబోతున్నట్లుగా ధనుష్( Dhanush ) టీం నుంచి క్లారిటీ వచ్చింది.
అంతే కాకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా జనవరి నుంచి షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ప్రస్తుతం శేఖర్ కమ్ముల చివరి దశ స్క్రిప్ట్ వర్క్ ను చేస్తున్నాడని అంటున్నారు.ఈ సినిమా ను ఏషియన్ సినిమా( Asian cinema ) వారు నిర్మించేందుకు రెడీ గా ఉన్నారు.ధనుష్ ప్రస్తుతం తమిళం తో పాటు హిందీ లో ఇతర భాషల్లో కలిపి నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు.
ఆ సినిమాల ఫలితాలను బట్టి ఈ సినిమా ఉంటుందని మొదట అనుకున్నారు.కానీ ఆ సినిమాల తో సంబంధం లేకుండా శేఖర్ కమ్ముల సినిమా ను మొదలు పెట్టాలని ధనుష్ నిర్ణయించుకున్నాడు.
మొదట స్క్రిప్ట్ విషయం లో బేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ ప్రచారం జరిగింది.చివరకు సినిమా యొక్క కథకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.జనవరి లో మొదలు పెడితే సమ్మర్ వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేస్తారేమో చూడాలి.