లవ్‌స్టోరీకి వాటితోనే బడ్జెట్‌ రికవరీ అయ్యేలా ఉంది

నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’.ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని తాజాగా నెలకొన్న కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా విడుదల కాలేదు.

అలాగే షూటింగ్‌ కూడా ముగియలేదు.అయినా కూడా సినిమాకు వస్తున్న బిజినెస్‌ ఆఫర్లు చూస్తే అంతా కూడా అవాక్కవుతున్నారు.

Lovestory Movie Complete With 25 Crores, Shekar Kammula, Nagachaitanya, Sai Pall

దర్శకుడు శేఖర్‌ ఈ సినిమాకు కేవలం 25 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశాడట.అది కూడా అయ్యిందో లేదో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అలాంటి సినిమాకు ఓవర్సీస్‌ రైట్స్‌ ద్వారా 8 కోట్ల వరకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement
Lovestory Movie Complete With 25 Crores, Shekar Kammula, Nagachaitanya, Sai Pall

ఇక శాటిలైట్‌ రైట్స్‌ను 15 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒక ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ సిద్దంగా ఉంది.ఇక ఓటీటీ రైట్స్‌ ద్వారా మరో 5 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఈ మూడు రైట్స్‌ ద్వారానే సినిమా బడ్జెట్‌ రికవరీ అవుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల రైట్స్‌తోI పాటు ఇతరత్ర రైట్స్‌ ద్వారా మరో పాతిక కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది.

సినిమా హిట్‌ అయితే మరింత లాభం.అంటే ఈ చిత్రం నిర్మాతలకు తక్కువలో తక్కువ పాతిక కోట్ల వరకు లాభాలు రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రముఖి లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement

తాజా వార్తలు